prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 11:19 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

అనారోగ్యంతో బాధపడుతున్న కల్లుగీత కార్మిక సంఘం నేతను పరామర్శించిన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు

ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట నవంబర్ 29 :

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) నర్సింహులపేట మండల మాజీ ప్రధాన కార్యదర్శి గాడిపెల్లి రవీందర్‌ను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పరామర్శించారు. నర్సింహులపేట మండల కేంద్రంలోని ఆయన నివాసానికి వెళ్లిన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌ను ఆప్యాయంగా పలకరించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు ధైర్యం చెప్పి, ఎలాంటి ఆందోళన చెందకుండా మనోధైర్యంతో ఉండాలని సూచించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రవీందర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి, వైద్య చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైన వైద్య చికిత్స అందిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గతంలో సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహించిన రవీందర్ సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు. సంఘం నాయకులు, కార్యకర్తలు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని పరామర్శించి అండగా నిలవడం సంఘం బాధ్యత అని పేర్కొన్నారు. రవీందర్ త్వరగా కోలుకునే వరకు సంఘం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నర్సింహులపేట మండల అధ్యక్షుడు డోనికేనా పటేల్, మండల కార్యదర్శి రామన్న గౌడ్, కాంగ్రెస్ పార్టీ నర్సింహులపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చిర్ర సతీష్ గౌడ్, నర్సింహులపేట గ్రామ సొసైటీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, మాజీ దేవస్థానం చైర్మన్ గండి దామోదర్ గౌడ్ నాయకులు ముత్తయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.