కత్తెరగండ్ల నూతన సర్పంచ్, వైస్ సర్పంచ్‌లను ఘనంగా సత్కరించిన వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి

పోరుమామిళ్ల,నవంబర్ 28:ప్రజావాణి శ్రీ అవధూత కాశినాయన మండలం,కత్తెరగండ్ల గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన శ్రీ పోతుగంటి గుర్రప్ప,వైస్ సర్పంచ్‌గా ఎన్నికైన శ్రీ పోతుగంటి ఖలీల్ శనివారం పోరుమామిళ్ల పట్టణంలోని బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి స్వగృహానికి విచ్చేశారు.వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా కత్తెరగండ్ల సర్పంచ్ స్థానంలో శ్రీ పోతుగంటి గుర్రప్ప అత్యంత ప్రజాదరణతో భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...