బద్వేల్ నియోజకవర్గం నవంబర్ 28ప్రజావాణి పోరుమామిళ్ల మండలం, సంచర్ల గ్రామపంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు ఈ రోజున బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సంచర్ల గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన శ్రీమతి చిత్తా పద్మావతి గారికి, వారి భర్త శ్రీ శేఖర్ రెడ్డికి,ఎన్నికల్లో విజయానికి విశేషంగా కృషి చేసిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలందరికీ నల్లేరు విశ్వనాథ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి,మాట్లాడుతూ.పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని,ఇదే ఐకమత్యం,స్ఫూర్తి,సమన్వయంతో భవిష్యత్తులో కూడా ముందుకు సాగాలని నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంచర్ల గ్రామపంచాయతీ వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు:శ్రీ బోయిళ్ళ చిన్నారెడ్డి మాజీ సర్పంచ్శ్రీ కొండా బాలకొండ రెడ్డి శ్రీ దస్తగిరి మాజీ సర్పంచ్శ్రీ నూనె చంద్రయ్య,మాజీ సర్పంచి సింగాల శేఖర్శ్రీ,నాగరాజు,శ్రీ పులిమర్తి భాషా,గాజులపల్లి నాగిరెడ్డి,శ్రీ బత్తుల గంగయ్య శ్రీ గౌర రమణయ్య,శ్రీ ముత్యాల రామయ్య శ్రీ ఎగ్గు రాముడు-శ్రీ ఆరోజు బ్రహ్మం శ్రీ పెమ్మిరెడ్డి సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.