prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 6:45 pm Digital Edition : PRAJA VANI

సమాజానికి ఆదర్శంగా… సేవలో ముందడుగు

సమాజానికి ఆదర్శంగా… సేవలో ముందడుగు

బోనకల్: సమాజానికి ఆదర్శంగా ఉండే పనులు చేపట్టడమే నిజమైన సేవకు నిదర్శనం. పదిమందికి మేలు చేసే పనుల్లో భాగస్వాములు కావాలనే సంకల్పంతో భాగం సేవా ఫౌండేషన్ నిర్వాహకులు, ఎన్నారై భాగం రాకేష్ ముందుకు సాగుతున్నారు. పేదలకు విద్య, వైద్య అవసరాల కోసం ఆర్థిక సాయం అందించడమే కాకుండా, గ్రామాభివృద్ధికి దోహదపడే పనులను సైతం చేపడుతూ తన సేవా నిరతిని చాటుకుంటున్నారు.
తాజాగా తన స్వగ్రామమైన గోవిందాపురం (ఏ) గ్రామంలోని స్మశాన వాటిక దుస్థితిని చూసి దాని శుభ్రత బాధ్యతను స్వయంగా చేపట్టారు. ముళ్లపొదలు, చెత్తాచెదారంతో డంపింగ్ యార్డును తలపిస్తున్న స్మశాన వాటికను జేసీబీ సహాయంతో స్వయంగా శుభ్రం చేయించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటోంది.
విదేశాల్లో ఉంటూ స్వగ్రామంపై మమకారంతో సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించడం, స్వయంగా శ్రమించి పనులు చేపట్టడం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. భాగం రాకేష్ సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తినిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగం శ్రీనివాసరావు, భాగం పాపారావు, భాగం రాధాకృష్ణమూర్తి, కావూరి శంకర్రావు, కావూరి వెంకట్రావు, గండమాల రాయప్ప, ఇసరం గోపి తదితరులు పాల్గొన్నారు.