prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 8:05 am Digital Edition : PRAJA VANI

సమన్వయంతో ఏరియా అభివృద్ధికి కృషి చేయాలి

*సమన్వయంతో ఏరియా అభివృద్ధికి కృషి చేయాలి*

*అధికారులకు ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ సూచన*

* *మన ప్రజావాణి మందమర్రి:-*

సింగరేణి ఏరియాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తూ, ఏరియా అభివృద్ధికి కృషి చేయాలని సింగరేణి అధికారులకు ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఆయన ఏరియా జిఎం కార్యాలయంలో ఏరియా పర్సనల్, అకౌంట్స్, సివిల్, ఐఈడి విభాగాల అధికారులతో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల వారీగా ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకొని, పెండింగ్లో ఉన్న పనులు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం, పరిపాలనా పరమైన పనుల్లో జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం జిఎల్ ప్రసాద్, ఏజిఎం ఎఫ్ అండ్ ఏ ఆర్విఎస్ఆర్కే ప్రసాద్, డిజిఎం పర్సనల్ సిహెచ్ అశోక్, డిజిఎం ఐఈడి కే కిరణ్ కుమార్, డిజిఎం సివిల్ మదీనా భాష, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.