prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 6:20 pm Digital Edition : PRAJA VANI

సంఖ్యాబలమే ప్రజాస్వామ్యమా తెలంగాణకు న్యాయం ఎక్కడ

*నేటి మాట – ప్రజావాణి*

*సంఖ్యాబలమే ప్రజాస్వామ్యమా?*

*తెలంగాణకు న్యాయం ఎక్కడ?*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 28 (ప్రజావాణి): మంచాల సరిహద్దులు మారితే సరిపోదు…
సమానత్వపు స్వరం వినిపించాలి!
సీట్లు పెరిగితే చాలు అనుకోవద్దు…
రాష్ట్రాల హక్కులు నిలవాలి!

119 అసెంబ్లీ స్థానాలతో,
17 పార్లమెంట్ స్థానాలతో,
దేశంలో తనదైన గుర్తింపు పొందిన తెలంగాణకు…
సీట్ల పెంపుతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి!

50 శాతం పెంపు జరిగితే
179 అసెంబ్లీ స్థానాలు,
26 పార్లమెంట్ స్థానాలు వస్తాయనే అంచనాలు…
కానీ పెరిగే సీట్లతోనే
తెలంగాణకు న్యాయం జరుగుతుందా?

దేశ పార్లమెంటులో 816 స్థానాల దిశగా అడుగులు పడితే,
409 మంది మద్దతుతోనే మెజారిటీ అధికారం దక్కితే,
26 స్థానాలతో ఉన్న తెలంగాణ గొంతుక
జాతీయ రాజకీయాల్లో బలంగా వినిపించగలదా?

జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు
తప్పు చేసినట్టా?
అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు
శిక్ష విధించాలా?
ఉత్తరాది ఆధిపత్యమే ప్రజాస్వామ్యమా?
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి విలువ లేదా?

సీట్ల పెంపకంలో జనాభాతో పాటు న్యాయం ఉండాలి…
నిధుల పంపకంలోనూ సమానత్వానికి స్థానం ఉండాలి!
ప్రతి రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కాలి…
ప్రతి ప్రాంతానికి సమాన అవకాశాలు కలగాలి!

మా ఆకాంక్ష అధికారం కోసం మాత్రమే కాదు…
తెలంగాణ హక్కుల కోసం!
తెలంగాణ భవిష్యత్తు కోసం!
భారత సమాఖ్య సమతుల్యత కోసం!

ప్రజాస్వామ్యం అంటే సంఖ్యాబలం మాత్రమే కాదు…
ప్రతి రాష్ట్రం గొంతుకకు విలువనివ్వడం!
ప్రతి ప్రాంతానికి న్యాయం చేయడం!
అదే నిజమైన ప్రజాస్వామ్యం…
అదే సమానత్వానికి అసలైన అర్థం!

తెలంగాణ హక్కుల విషయంలో రాజీ వద్దు…
దక్షిణాది ఆత్మగౌరవం విషయంలో వెనకడుగు వద్దు!

✍️ **మీ లింగం కడారి*
*రిపోర్టర్ – ప్రజావాణి*
*మంచాల మండలం*