**శిథిల ట్యాంక్‌తో ముప్పు.. కొత్త ట్యాంక్ కోసం వినతి!**
వేలేరు మండలం, శాలపల్లి | నవంబర్ 28:శాలపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే ప్రమాదం ఉన్న రక్షిత మంచినీటి వాటర్ ట్యాంక్‌ను గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ పరిశీలించారు. RWS ఏఈ చందు నాయక్‌కు ట్యాంక్ పరిస్థితిని వివరించి, రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన వాటర్ హెడ్ ట్యాంక్‌ను తక్షణమే మంజూరు చేసి, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు.
అనంతరం గ్రామ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న బోర్‌వెల్ రీఛార్జ్ పనులను పరిశీలించారు.
అలాగే లక్ష్మీతండాలో గూగులోత్ శ్రీను–స్వప్న దంపతుల కుమార్తె వివాహం సందర్భంగా వారికి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని సర్పంచ్ అశోక్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మండల కొమురయ్య, మాలోత్ వినోద్, గ్రామపంచాయతీ సిబ్బంది రవీందర్, బొందిరాజు తదితరులు పాల్గొన్నారు.