prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 9:17 pm Digital Edition : UPENDHAR JANAGON

వరంగల్ లో అఖిల – మనీష్ రెడ్డి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): వరంగల్‌లోని పీడీఆర్ గార్డెన్స్‌లో శనివారం ఘనంగా జరిగిన అఖిల – మనీష్ రెడ్డి వివాహ మహోత్సవానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.

మాజీ మంత్రి, వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖతో కలిసి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు.

వరంగల్ పర్యటనలో భాగంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, మాజీ మంత్రి, వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖతో కలిసి కోట గండి మైసమ్మ ఆలయాన్ని, సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని, సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.