రేషన్‌లో నాశిరకం సన్న బియ్యం… పౌరసరఫరాల శాఖ నిద్రపోతోందా

*రేషన్‌లో నాశిరకం సన్న బియ్యం... పౌరసరఫరాల శాఖ నిద్రపోతోందా....?* రాయికల్, నవంబర్ 28 (ప్రజావాణి): పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం అమలు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చౌక ధరల దుకాణాల్లో పంపిణీ అవుతున్న బియ్యం నాణ్యత లేకపోవడంతో వేలాది పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ పరిస్థితికి పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.బియ్యంలో నూక శాతం అధికంగా ఉండడం, పురుగు పట్టిన గింజలు, దుమ్ము, రాళ్లు, దుర్వాసన, వండితే ముద్దగా...