రాచబంటి అరుణకుమారి అత్యధిక మెజార్టీతో గెలవాలని ఘన సన్మానం
వత్సవాయి, నవంబర్ 27 మన ప్రజావాణి
వత్సవాయి మండలం వేములనర్వ గ్రామంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాచబంటి అరుణకుమారి అత్యధిక మెజార్టీతో గెలవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా మంచితనం తో పాటు సంచి ఇచ్చి రాచబంటి అరుణకుమారిని సన్మానించారు. గ్రామ అభివృద్ధికి ఆమె కృషి చేస్తారని, ఆమెకు అందరూ అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.