prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 2:43 pm Digital Edition : PRAJA VANI

మోదీ”చారిత్రక బిల్లులు..ప్రధానికి పాలాభిషేకం

“మోదీ”చారిత్రక బిల్లులు..ప్రధానికి పాలాభిషేకం

ప్రజావాణి,ఇనుగుర్తి: ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో మహిళా రిజర్వేషన్, డి లిమిటేషన్ బిల్లులు ప్రవేశపెట్టడానికి తీసుకున్న కీలక చారిత్రాత్మక నిర్ణయం పట్ల మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల బిజెపి హర్షం ప్రకటించాయి. ఈ మేరకు ఆ పార్టీ మండల అధ్యక్షులు దుంపల సందీప్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు మండల కేంద్రం ఇనుగుర్తి లో శనివారం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రముఖులు మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళల రాజకీయ సాధికారతకు దోహదపడుతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం(ఈనెల 27న)మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మహిళా రిజర్వేషన్ అమలుకు అనుసంధానంగా డీలిమిటేషన్, పార్లమెంట్ స్థానాల పెంపునకు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలపడం అపూర్వమన్నారు.దీంతో పార్లమెంట్‌లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం లభించడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని కొనియాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దుంపల సందీప్, మండలంలోని వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు,మోదీ అభిమానులు పాల్గొన్నారు.