*మహాసభలకు కలెక్టర్, డీపీఆర్వోకు ఆహ్వానం*
*జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీపీఆర్వో విష్ణువర్ధన్‌కు ఆహ్వాన పత్రికలు అందజేసిన టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకులు*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 28:–
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 1న నిర్వహించనున్న జిల్లా మూడో మహాసభలను విజయవంతం చేయాలని సంఘం నాయకులు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మహాసభలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
అనంతరం జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) విష్ణువర్ధన్‌ను కలిసి మహాసభలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై మహాసభల్లో చర్చించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. మహాసభలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వేణుగోపాల్, అశోక్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్, సంఘం సభ్యుడు బోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.