మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
• జోగిపేటలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు
జోగిపేట | నవంబర్ 28 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి
జోగిపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి. నాగభూషణం, కరుణాకర్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన మార్గం నేటి సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం, ఎ. శంకరయ్య, బిర్ల శంకర్, సటికే రాజు, పల్లె వెంకట రమణ, రఫిక్, పెండ గోపాల్, లింగం, సంతోష్ యాదవ్, శ్రీనివాస్, బాజీ తదితరులు పాల్గొన్నారు.