*బీజేపీ మండల అధ్యక్షుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డి* *కుమారుడి వివాహ వేడుకకు హాజరైన రాజకీయ ప్రముఖులు*
మంచాల, నవంబర్ 28 (ప్రజావాణి):
మంచాల మండల బీజేపీ అధ్యక్షుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డి కుమారుడి వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వింజమూరి వెంకటరెడ్డి, అనిరెడ్డి వెంకటరెడ్డి, మల్గా శ్రీశైలం, గడ్డం రాజేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు జంబుల శ్రీధర్ రెడ్డి, గ్యార శేఖర్, అశ్వాల బాలరాజు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులందరూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో నాయకులు, బంధుమిత్రుల సందడితో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.