prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 8:04 am Digital Edition : PRAJA VANI

ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం పనిచెయ్యాలి : సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం పనిచెయ్యాలి : సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

జహీరాబాద్, నవంబర్, 27 (ప్రజావాణి): ప్రభుత్వాలు ఏవి ఉన్న ప్రజా సంక్షేమం కోసం పని చెయ్యాలని, సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దాదాపు అమలు చెయ్యడం జరిగిందని ఆల్గోల్ గ్రామ సర్పంచ్ చల్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జహిరాబాద్ మండలంలోని అల్గొల్ గ్రామంలో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చల్లా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్హులైన గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో అల్గొల్ ఉపసర్పంచ్ బుజ్జమ్మ, వార్డు సభ్యులు అలోక్ కుమార్, సయ్యద్ ముబీన్, బీఆర్ఎస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, రేషన్ డీలర్ పసుపుల ప్రభాకర్, పట్వారీ ఖయుమొద్దీన్, పంచాయతీ కార్యదర్శి డేవిడ్ రాజ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ రేషన్ సేవలను సులభంగా పొందేందుకు అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.