prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 4:33 pm Digital Edition : PRAJA VANI

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పలాభిషేకం.

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పలాభిషేకం.

ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 28 :
నరసింహుల పేట మండలంలోని అంబేద్కర్ సెంటర్లో నరసింహుల పేట మండలం అధ్యక్షులు సురబోయిన సతీష్ ఆధ్వర్యంలో, బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేశారు. లోక్ సభ నియోజకవర్గ పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం బిజెపి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పెంపు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నట్లు బిజెపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఏరనాగి కుమారస్వామి, ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, మెరుగు యాకయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు శారదా రెడ్డి,కాలు నాయక్, దాసరి వీరన్న, బానోత్ రమేష్, ఉంగరాల వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.