పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత

రూ.21 వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం కరీంనగర్, నవంబర్ 28 (ప్రజావాణి) కరీంనగర్ పట్టణంలోని వీ-పార్క్ హోటల్ సమీపంలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.21 వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ సతీష్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఐ సురేందర్, ఏఎస్ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సురేందర్ సింగ్, మల్లేష్, కానిస్టేబుల్ రాజు దాడిలో పాల్గొన్నారు.