నిషేధిత పొగాకు విక్రయాలపై హసన్‌పర్తి పోలీసుల మెరుపు దాడి.. వ్యాపారి అరెస్ట్!
కిరాణా దుకాణంలో రూ.4,365 విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
నిషేధిత పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: హసన్‌పర్తి సీఐ ఎ. మహేందర్ హెచ్చరిక
హసన్‌పర్తి, నవంబర్ 27, మన ప్రజావాణి:
ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్న వ్యాపారులపై హసన్‌పర్తి పోలీసులు కొరడా ఝళిపించారు. హసన్‌పర్తి గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా కిరాణా దుకాణంలో ఒక ప్లాస్టిక్ సంచిలో నిల్వ ఉంచిన ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచుల సమక్షంలో దుకాణ యజమానిని విచారించగా, అతను హసన్‌పర్తి గ్రామానికి చెందిన అనుగం సతీష్ (45), తండ్రి ధనుంజయ్యగా గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న సరుకు వివరాలు:
– అనార్ పౌచులు – 7
– ఆర్.ఆర్ పొగాకు ప్యాకెట్లు – 5
– అంబర్ పొగాకు ప్యాకెట్లు – 5
– బాబా బ్లాక్ ప్యాకెట్లు – 5
– అంబర్ పౌచులు – 9
పోలీసులు స్వాధీనం చేసుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తుల మొత్తం విలువ రూ.4,365గా ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిషేధిత పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు!
ఈ సందర్భంగా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను ఎవరైనా విక్రయించినా, నిల్వ ఉంచినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యాపారులు తమ పద్ధతులు మార్చుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.