డిలిమిటేషన్ మహిళ బిల్లులకు
బేషరతు గా మద్దతివ్వాలి:బిజెపి రాజ్ కుమార్
ప్రజావాణి, నెల్లికుదురు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ని కేంద్ర ఎన్ డి ఏ గవర్నమెంట్
మహిళా సాధికారత కోసం తీసుకువచ్చే మహిళా బిల్లుకు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల కు కాంగ్రెస్,బిఆర్ఎస్ తో పాటు దేశంలోని అన్ని విపక్షాలు బే షరతుగా మద్దతివ్వాలని బిజెపి మండల అధ్యక్షులు చందు రాజ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా తో మాట్లాడుతూ మహిళల సంఖ్య చట్టసభల్లో 33 శాతం పెరగాలనే గొప్ప ఉద్దేశంతో బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తీసుకు తీసుకువస్తుందని చెప్పారు.లేనిపోని సాకులు చూపుతూ విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేయవద్దన్నారు. డి లిమిటేషన్ తో లోక్ సభ,శాసనసభ స్థానాలు పెరిగి పాలనా సౌలభ్యం చేకూరుతుందన్నారు.దక్షిణాది, ఉత్తరాది అని లేవనెత్తుతూ అడ్డుకునే ప్రయత్నం విరమించుకోవాలన్నారు. బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందుతే తమకు పుట్టగతులుండవనే దురుద్దేశంతో విపక్షాలు అవాకులు,చవాకులు పేలుతూ సాకులు వెతుకుతూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా,డీలిమిటేషన్ పై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం తీసుకువచ్చే సంబంధిత బిల్లులకు బేషరతుగా పూర్తిస్థాయిలో మద్దతు పలికి ఆమోదింప చేయాలని కోరారు. లేని పక్షంలో చరిత్రలో మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకులుగా మిగిలిపోతారన్నారు.