prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 2:31 pm Digital Edition : PRAJA VANI

టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంటికి వచ్చి నూతన వధూ వరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి హరీష్ రావు

*టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంటికి వచ్చి నూతన వధూ వరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి హరీష్ రావు*

మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి ప్రతినిధి : నవంబర్ 28

… *21 సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా కలుసుకున్న ఇరువురు నేతలు*
ఆప్యాయంగా పలుకరించుకున్న ఇరువురు నేతలు
జగ్గారెడ్డి కామెంట్స్
2004 లో హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన కలిసి ఆయన ఛాంబర్ లో భోజనం చేసే వాళ్ళం
ఆ తర్వాత నేను కాంగ్రెస్ లో వచ్చాక.. మళ్ళీ ఇప్పటి వరకు హరీశ్ రావుని కలవలేదు
21 ఏళ్ల తర్వాత మొదటిసారి మళ్ళీ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసాము
కూతురి పెళ్లికి హరీష్ రావుని పిలవలేకపోయాను…కానీ ఈ ఫంక్షన్ మిస్ కావొద్దని ఆహ్వానించాను
మా ఇద్దరి కలయికలో ఎటువంటి రాజకీయాలు లేవు..మా కలయికలో ఎటువంటి మతలబు లేదు
రాజకీయం…రాజకీయమే హరీష్ రావు BRS లో అగ్రనేత
నేను కాంగ్రెస్ లో టాప్ లీడర్ కాకపోయినా ఓ స్థాయి లీడర్ నే
అనేక ఫంక్షన్ లకు ఆయన్ని పిలవలేకపోయాను
పదేళ్లు హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన్ని కలవలేదు