గ్రామ సమస్యల పరిష్కారంపై అధికారుల చొరవ చూపాలి
మండల సమన్వయ సమీక్ష సమావేశంలో సర్పంచుల ఆవేదన.. మొక్కుబడిగా సాగిందని అసంతృప్తి ఎల్కతుర్తి, నవంబర్ 27 (ప్రజావాణి) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో మూడోసారి మండల సమన్వయ, సమీక్ష సమావేశం స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించాల్సి ఉండగా, సమావేశం మొక్కుబడిగా సాగిందని పలువురు సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో...