prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 9:05 am Digital Edition : RAJASHEKARREDDY

గ్రామ సమస్యల పరిష్కారంపై అధికారుల చొరవ చూపాలి

మండల సమన్వయ సమీక్ష సమావేశంలో సర్పంచుల ఆవేదన..

మొక్కుబడిగా సాగిందని అసంతృప్తి

ఎల్కతుర్తి, నవంబర్ 27 (ప్రజావాణి)

 

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో మూడోసారి మండల సమన్వయ, సమీక్ష సమావేశం స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించాల్సి ఉండగా, సమావేశం మొక్కుబడిగా సాగిందని పలువురు సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులు తమను పదేపదే ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సర్పంచులకు గ్రామస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డి స్పందిస్తూ గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, సర్పంచులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండల సమన్వయ సమావేశాల ద్వారా గ్రామస్థాయి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో విజయ్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్ రమేష్, ఏవో రాజ్ కుమార్, వెటర్నరీ డాక్టర్ రవీందర్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, ఏపీవో అనిత, ఏపీఎం కవిత, గోపాల్‌పూర్ పీహెచ్‌సీ డాక్టర్ విజేందర్ రెడ్డి, మండలంలోని సర్పంచులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.