prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 9:37 am Digital Edition : PRAJA VANI

కౌలాస్ లో గ్రామసభ నిర్వహణ

కౌలాస్ లో గ్రామసభ నిర్వహణ

సర్పంచ్ విద్యా-బలరాం అధ్యక్షతన

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 28

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో శుక్రవారం రోజున సర్పంచ్ విద్య -బలరాం అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు.. ఊరిలోని సమస్యలు, అభివృద్ధి పనులపై గ్రామస్తులతో అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విద్య బలరాం మాట్లాడుతూ…. గ్రామం అభివృద్ధి సాధించాలంటే గ్రామస్తులందరూ ఐక్యంగా ఉంది సహకరించాలని కోరారు.. ప్రజలందరూ భాగ్యస్వాములైతేనె గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చుఅని ఊరు కోసం అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. ఏపీఓ తులసి రామ్ మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకం పనుల ప్రాధన్యతను గ్రామస్తులకు వివరించారు.. ఊరిలో ఏమైనా సమస్యలు ఉంటే సర్పంచ్ మరియు అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ పూజారి గణేష్, బొగ్గుల గంగాధర్, విశ్వనాథ్ పంతులు, రాజేష్, మంత్రి సాయిలు, రమేష్, హనుమాన్లు, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు..