ఊమ్మడి మెదక్ లో ముగిసిన “108” అంబులెన్సు సిబ్బందికి రిఫ్రెష్ ( శిక్షణ ) తరగతులు
మద్దూరు నవంబర్28, ప్రజా వాణి,
ఉమ్మడి మెదక్ లోని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్, మరియు పైలట్లకు గత సోమవారం మొదలైన శిక్షణ తరగతులు శనివారం నేటితో ముగిసాయానీ ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ బయ్యా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ లో బాధితులకు నాణ్యమైన ప్రీ హాస్పిటల్ కేర్ అందించటంలో మెలకువలు, మరియు బాధితులను ఆసుపత్రులకు తరలిచటం లో ఎటువంటి జాప్యం చేయకూడదని వివరించారు.
ఈ కార్యక్రమం లో సిద్దిపేట జిల్లా “108” కోర్డినేటర్ నవీన్ కుమార్, ఈ ఏం ఎల్ సి ఇన్స్ట్రక్టర్ అరుణ్, మరియు సిద్దిపేట జిల్లా మెడికల్ టెక్నీషియన్స్, పైలట్స్ పాల్గొన్నారు.