ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
• డిసెంబర్ 5న జోగిపేటలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం.. మెగా హెల్త్ క్యాంపు
ఆందోల్ | నవంబర్ 28 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆందోల్ ఎమ్మెల్యే దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని డిసెంబర్
5వ తేదీన పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సేవా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు.
కార్యక్రమాల షెడ్యూల్
ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేటలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవంతో పాటు మెగా హెల్త్ క్యాంపును నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 2 గంటలకు సంగుపేటలోని లక్ష్మీదేవి గార్డెన్స్‌లో ఆందోల్ నియోజకవర్గ ప్రజల సమక్షంలో మంత్రి జన్మదిన వేడుకలను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొననున్నారు.
పూలమాలలు, శాలువాలకు బదులుగా విద్యా సామగ్రి తీసుకురావాలని విజ్ఞప్తి
మంత్రి జన్మదిన వేడుకల్లో శాలువాలు, పూలమాలలు, బొకేలు స్వీకరించబోమని నిర్వాహకులు స్పష్టం చేశారు. వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్, పెన్నులు, ఇతర విద్యా సంబంధిత వస్తువులను మాత్రమే తీసుకురావాలని కోరారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.