అనారోగ్యంతో బాధపడుతున్న ఫోటోగ్రాఫర్‌కు అసోసియేషన్ అండ
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సుదర్శన్‌కు రూ.8 వేల ఆర్థిక సహాయం
మంగపేట, నవంబర్ 28 (ప్రజావాణి):
మండలంలోని బోరు నర్సాపురం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఇర్సవడ్ల సుదర్శన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రోజు విడిచి రోజు వరంగల్‌లోని అజరా ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ విషయం తెలుసుకున్న మంగపేట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు స్పందించారు. శనివారం అసోసియేషన్ అధ్యక్షుడు వడ్లకొండ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సుదర్శన్‌కు రూ.8 వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న సంఘ సభ్యులకు అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో సహాయం అందించిన ప్రతి ఫోటోగ్రాఫర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కపెల్లి రాజేష్, ఆర్గనైజర్ పూజరి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు అక్కపెల్లి నరేష్, గౌరవ సలహాదారులు వడ్లకొండ వీరయ్య, ప్రధాన కార్యదర్శి ఇప్పాల నరేష్, కోశాధికారి ఉగ్గుమల్ల గణేష్, ఉపాధ్యక్షుడు పసుపులేటి రాజశేఖర్, బండి రాకేష్, ఎస్. రవి, మాటూరి సాయి కుమార్, జాడి యుగేందర్, దిడ్డి శ్రీనివాస్, గూడురు ప్రవీణ్, కోర్స రాకేష్, వడ్లకొండ పూర్ణచందర్, ఎన్ఆర్ నాని తదితరులు పాల్గొన్నారు.