పోరుమామిళ్ల డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

పోరుమామిళ్ల నవంబర్ 27ప్రజావాణి కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను శుక్రవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శామ్యూల్ డేవిడ్ రాజ్ హాజరుకాగా,కళాశాల అధ్యాపకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.ఈ వేడుకలతో కళాశాల ప్రాంగణం సందడి,ఆనందోత్సాహాలతో కళకళలాడింది.ఈ సందర్భంగా కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. సీనియర్లు,జూనియర్లు ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ స్నేహభావాన్ని పంచుకున్నారు.కళాశాల జీవితంలో కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం...