సావిశెట్టిపల్లి సర్పంచ్‌గా విజయం సాధించిన బండి లక్ష్మీ: నల్లేరు విశ్వనాథ రెడ్డి సమక్షంలో ఘనంగా అభినందనలు
కాశినాయన బద్వేల్: నవంబర్ 27ప్రజావాణి వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం సావిశెట్టిపల్లి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన శ్రీమతి బండి లక్ష్మీ ఈరోజు బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.సర్పంచ్‌గా ఎన్నికైన అనంతరం ఆమె తన గ్రామ పెద్దలు,వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులతో కలిసి నల్లేరు విశ్వనాథ రెడ్డి స్వగృహానికి విచ్చేసారు.ఈ సందర్భంగా విశ్వనాథ రెడ్డికి నూతన సర్పంచ్ బండి లక్ష్మీమరియు సావిశెట్టిపల్లి గ్రామస్తులు...