prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 8:21 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కొప్పలకొండ నూతన సర్పంచ్‌గా వడ్డే ఎల్‌ఐసీ ఆదినారాయణ ప్రమాణస్వీకారం

ఏకగ్రీవ ఎన్నికతో బాధ్యతలు స్వీకరణ.గ్రామాభివృద్ధికి పెద్దపీట వేస్తానని హామీ

అనంతపురం జిల్లా,నవంబర్ 27ప్రజావాణి గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామ నూతన సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వడ్డే ఎల్‌ఐసీ ఆదినారాయణ గురువారం గ్రామ సచివాలయంలో ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు,గ్రామ పెద్దలు, స్థానిక ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చి నూతన సర్పంచ్‌కు అభినందనలు తెలియజేశారు.ఏకగ్రీవంగా తనను ఎన్నుకుని గ్రామ పాలన బాధ్యతలు అప్పగించిన గ్రామ ప్రజలకు ఆదినారాయణ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వడ్డే ఎల్‌ఐసీ ఆదినారాయణ మాట్లాడుతూ గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం,రహదారులు,వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆదినారాయణకు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు.