ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారంతో చింతలపల్లిలో నూతన పాలనకు శ్రీకారం! సర్పంచ్ గంధము భాస్కర్,

కలసపాడు నవంబర్ 27ప్రజావాణి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా,ప్రజాసేవే ధ్యేయంగా చింతలపల్లి గ్రామపంచాయతీలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్,ఉప సర్పంచ్‌తో పాటు పది మంది వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంతో చింతలపల్లి గ్రామంలో నూతన పాలనకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయింది.కలసపాడు మండలం చింతలపల్లి గ్రామపంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గంధము భాస్కర్,ఉప సర్పంచ్ సుగతి చెన్నయ్యతో పాటు పది మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను స్వీకరించారు.ఈ కార్యక్రమానికి రిటర్నింగ్ అధికారి...