prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 3:05 pm Digital Edition : PRAJA VANI

సుందిల్లలో 63 మందికి నూతన చేయూత పింఛన్లు

సుందిల్లలో 63 మందికి నూతన చేయూత పింఛన్లు

రామగిరి,మన సమగ్ర ప్రజావాణి నవంబర్ 27

రామగిరి మండలం సుందిల్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో నూతన ఇందిరమ్మ చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన 63 మంది అర్హులు నూతన పింఛన్లకు ఎంపికయ్యారు.
వితంతువులు, దివ్యాంగులు,ఒంటరి మహిళలు,గీత కార్మికులు తదితర అర్హులకు పింఛన్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. నూతనంగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు పింఛన్లు అందేలా కృషి చేసిన సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జనగామ సదానందం, గ్రామ కార్యదర్శి రమేష్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గర్రెపెల్లి ప్రవీణ్ గౌడ్,వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగామ కృష్ణ,మాజీ సర్పంచ్ ఊట్ల గోపాల్ రెడ్డి, దేవాలయ డైరెక్టర్ రేకుంట్ల రవి,కొరకొప్పుల లక్ష్మణ్ గౌడ్,మణికంఠ గౌడ్,దాసరి పృథ్వీ,జునగారి శంకర్, సమతాకారి సందీప్,ఆర్ల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.