విద్యార్థుల సిరిసిల్ల ఇండస్ట్రియల్ టూర్‌కు జెండా ఊపిన సర్పంచ్, ఎంఈఓ
బీర్కూర్: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి శుక్రవారం విద్యార్థులు సిరిసిల్లకు ఇండస్ట్రియల్ టూర్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ, మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్న జెండా ఊపి విద్యార్థుల పర్యటనను ప్రారంభించారు.
ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా 9, 10వ తరగతులకు చెందిన విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్‌వేర్, అపెరల్ అండ్ టెక్స్‌టైల్స్ పరిశ్రమలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మతేజ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు పరిశ్రమల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించి, నూతన విషయాలను నేర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పద్మ, ఉపాధ్యాయులు భరత్ కుమార్, సోమేశ్వర్, దశరథ్, సింధు, కిరణ్మయి, విట్టల్, పిరయ్య తదితరులు పాల్గొన్నారు.