prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 5:06 pm Digital Edition : PRAJA VANI

వరంగల్ పండ్ల మార్కెట్‌పై బీజేపీ గళం

**వరంగల్ పండ్ల మార్కెట్‌పై బీజేపీ గళం**

వరంగల్ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేసి రైతులు, వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు బీజేపీ నాయకులు, పండ్ల మార్కెట్ వ్యాపారులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 85 గదులతో చేపట్టిన మార్కెట్ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.11 కోట్ల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. సరైన వసతులు లేక రైతులు, వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని మార్కెట్ పనులు పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పండ్ల మార్కెట్ అధ్యక్షుడు వెల్ది సాంబయ్య, కార్యదర్శులు చెన్నమల్లు యాదవ్, సమ్మయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.