prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 12:06 pm Digital Edition : PRAJA VANI

వరంగల్‌లో ఆరు కాలేజీల మైదానాల్లో వాకింగ్‌కు తాత్కాలిక నిషేధం

**వరంగల్‌లో ఆరు కాలేజీల మైదానాల్లో వాకింగ్‌కు తాత్కాలిక నిషేధం**

నవంబర్ 29న వరంగల్ ట్రై సిటీలోని 32 పరీక్షా కేంద్రాల్లో ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 28 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 29 ఉదయం వరకు ఆరు కాలేజీల మైదానాల్లో వాకింగ్‌కు అనుమతి ఉండదని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు.

కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ హైస్కూల్, హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కాకతీయ డిగ్రీ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌తో పాటు వరంగల్‌లోని లాల్ బహదూర్ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.