రైతులకు భరోసా ఏది.. బోనస్ ఎక్కడ? మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో భద్రకాళి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...