రాజ్యాంగ సృష్టికర్తకు జోహార్.. రాజ్యాంగ పరిరక్షణకు సీపీఐ కార్యకర్తల ప్రతిజ్ఞ

ఘట్‌కేసర్, నవంబర్ 26: భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతామని సీపీఐ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఘట్‌కేసర్ అన్నోజిగూడ ఆర్‌జీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ మాట్లాడుతూ, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులకు, రైతులు, కార్మికులు, విద్యార్థుల హక్కులకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే...