మాదిగ ఉపకులాల ఐక్యతతోనే అన్ని రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం
నవంబర్ 29న పబ్లిక్ గార్డెన్స్‌లో అలయ్ బలయ్ వనభోజనాల కార్యక్రమం
మాదిగ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 27
హైదరాబాద్: మాదిగ ఉపకులాల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు అన్ని రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం సాధించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు.
ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న మాదిగ ఉపకులాల వనభోజనాలు, అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ప్రతినిధులకు ఆయన ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ, ఇతర అన్ని రంగాల్లో మాదిగ ఉపకులాలకు తగిన ప్రాతినిధ్యం లభించాలంటే మాదిగలందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యత, పరస్పర సహకారం, సంఘటిత శక్తితోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అందులో భాగంగానే నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని మాదిగ ఉపకులాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు సామాజిక ఐక్యతకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
పిడమర్తి రవి ఆహ్వానం మేరకు తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోరం సభ్యులు, జర్నలిస్టు మిత్రులందరూ ఈ నెల 29న జరిగే అలయ్ బలయ్ వనభోజనాల కార్యక్రమానికి వీలైనంత ఎక్కువ సంఖ్యలో హాజరై ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.