జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):నవంబర్ 29న నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జరగబోయే మాదిగల అలయ్ – బలయ్ కార్యక్రమం కరపత్రాలను తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆవిష్కరించారు.
మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గండి శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు జనగాం యాదగిరి మాదిగ ఆధ్వర్యంలో ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జరిగే మాదిగ ఉప కులాల వన భోజనాలకు రాష్ట్రం నలుమూలల నుండి మాదిగ, మాదిగ ఉప కులాలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆత్మీయ అనుబంధాలను, ఐకమత్యాన్ని చాటి చెప్పేలా గడప గడప నుండి తరలివచ్చి అలయ్ – బలయ్ ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లింగాలఘణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ మనోహర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొల్లూరి శివ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నర్సింగ రమేష్, సర్పంచ్ విష్ణు కుమార్, వడిచర్ల గ్రామ శాఖ అధ్యక్షులు దూసరి సోమనర్సయ్య, మాజీ మేడిచర్ల అధ్యక్షులు కోతి రాములు, గండి శ్రీనివాస్, గండి సుకేష్, సోషల్ మీడియా వారియర్స్ శశి కుమార్, దాసరి రాజేష్, యూత్ అధ్యక్షులు గండి కుమార్, ముఖ్య నాయకులు, దళిత సోదరులు పాల్గొన్నారు.