మల్యాల: మండలం నవంబర్ 27 (ప్రజావాణి): మల్యాల మండలములో అన్ని గ్రామంలో నూతన చేయూత పెన్షన్ల మంజూరుపై హర్షం – సీఎం,రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం
మల్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, యూవజన కాంగ్రెస్ అధ్యక్షులు శనిగరపు తిరుపతి ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా పెన్షన్లు మంజూరు చేసి వారి ఖాతాల్లో నగదు జమ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ అందడం వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైన ప్రభుత్వం కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యరూపంలో అమలు చేస్తూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో నిరంతరం కృషి చేస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మండలములో అన్ని గ్రామాల సర్పంచ్ నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదారులుతో కలిసి సీఎం ఎమ్మెల్యే గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమంలో సర్పంచల ఫోరమ్ అధ్యక్షులు మిల్ట్రీ శ్రీనివాస్,కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నక్క అనిల్,గుడిపేట సర్వపూర్,రాంపూర్,తాటిపల్లి,లంబాడిపల్లి మ్యాడంపల్లి, మనాల, పోతారం, రాజరాం,బల్వంతాపూర్, ఓగులాపూర్, గ్రామాల సర్పంచ్ లు ఇట్టిరెడ్డి శ్వేతా రెడ్డి, జంగలి హనుమంతు, బద్ధం సంధ్య తిరుపతిరెడ్డి, మెట్పల్లి లత, మరాఠీ సంధ్యా సత్తయ్య, గాతం అంజయ్య, బల్మూరి పాపారావు, కొండపలకల గోదాదేవి, గుర్రం విజయ్, కరుణ, గాదం కుమార్ ఉపసర్పంచ్, కాటుకం వినయ్, పొన్నం మల్లేశం, కంచర్ల లక్ష్మణ చారి పరశురాం, మహిళ నాయకులు లహరి, మంద తిరుపతి,దూస వెంకన్న, మురళి, ఇట్టే రమణ నాయకులు చేయూత పెన్షన్ లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
