మర్మాములలో స్టోర్ నిర్మాణం కోసం భూమి పూజ

మర్మాములలో స్టోర్ నిర్మాణం కోసం భూమి పూజ మద్దూరు నవంబర్27, ప్రజా వాణి, మండలంలోని మర్మాముల గ్రామంలోని ప్రసన్నాంజనేయ గుడిలో స్టోర్ రూమ్ నిర్మాణం కొరకు ముఖ్య అతిధి గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ ,కొబ్బరికాయ కొట్టి,ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. స్టోర్ రూమ్ నిర్మాణ దాత ఊట్ల శ్రీనికేతన్ రెడ్డికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో మద్దూరు మండల మాజీ వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆలేటి విష్ణు,ఆలయ పూజారి సుందరగిరి సిద్దయ్య పాల్గొన్నారు.