prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 3:17 pm Digital Edition : PRAJA VANI

మంచాల టీపీఎస్ పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

*మంచాల టీపీఎస్ పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం*

*బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సర్పంచ్ మానస వినయ్*

మంచాల, నవంబర్ 27 (ప్రజావాణి):

మంచాల మండల కేంద్రంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)లో బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మానస వినయ్ హాజరై విద్యార్థినులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మానస వినయ్ మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల విద్యకు, ఆరోగ్యానికి, భవిష్యత్తుకు ఆటంకంగా మారుతాయని తెలిపారు. బాలికలందరూ చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, బాల్య వివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు కలిసి కృషి చేయాలని సూచించారు.

అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, భోజన నాణ్యత, నిర్వహణ వివరాలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింగం, వార్డు సభ్యులు నీళ్ల పారిజాత కృష్ణ, గ్యార జంగయ్య, దూసరి కల్పనా కుమార్, అశ్వల మాధవి బాలరాజు, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.