prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 10:36 am Digital Edition : PRAJA VANI

భారత రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన

భారత రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన

• ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

జోగిపేట | నవంబర్ 27 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవంబర్ 26న నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు. విద్యార్థులకు వివిధ రకాల డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా, వారు ఎంతో ఆసక్తిగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

అనంతరం భారత రాజ్యాంగ పీఠికను విద్యార్థులు, ఉపాధ్యాయులతో చదివించి రాజ్యాంగ విలువలపై ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక విలువలను వివరించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకుంటూ బాధ్యతగల పౌరులుగా ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సద్గుణ మేరీ గ్రేస్ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.