బీఆర్ఎస్ యువ నాయకులపై అక్రమ కేసులు, బైండోవర్ ను ఖండించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి బైండోవర్ చేయడం జనగామ జిల్లాలో కలకలం రేపింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపినందుకు ఏకంగా 10 నెలల తర్వాత కేసులు పెట్టడం, నోటీసులు ఇచ్చి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ యూత్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జనగామలో నిరసన ప్రదర్శన చేపట్టారు....