ఎఐవైఎఫ్ బెజ్జంకి మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్
బెజ్జంకి, నవంబర్ 27 (ప్రజావాణి)
రేషన్ కార్డులో ఒక్కరి పేరు మాత్రమే ఉన్న ఒంటరి వ్యక్తులకు కూడా ఇందిరమ్మ బీమా వర్తింపజేయాలని ఎఐవైఎఫ్ బెజ్జంకి మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఒంటరి రేషన్ కార్డుదారులకు బీమా వర్తించేలా ప్రభుత్వం నిబంధనలు సవరించాలని కోరారు.రేషన్ కార్డులో ఒక్కరే ఉన్నారనే కారణంతో ఇందిరమ్మ బీమా పథకానికి అర్హులైన వారిని దూరం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులకు సైతం బీమా సౌకర్యం కల్పించాలని, నామినీ సమస్యను పరిష్కరించి అర్హులందరికీ పథకం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఒంటరి రేషన్ కార్డుదారులకు బీమా సౌకర్యం కల్పిస్తూ న్యాయం చేయాలని దొంతరవేణి మహేష్ కోరారు.