దీక్షా దివస్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి): నవంబర్ 29న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు శుక్రవారం పాలకుర్తి చౌరస్తాలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం, మండల నాయకులతో కలిసి కార్యక్రమ నిర్వహణకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లు, స్థల ఎంపిక, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం తదితర అంశాలపై నాయకులతో చర్చించారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ...