prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 4:30 pm Digital Edition : UPENDHAR JANAGON

డిసెంబర్ 1న కలెక్టరేట్ ముందు ధర్నాకు సీపీఐ పిలుపు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):ఎస్.ఐ.ఆర్ పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ డిసెంబర్ 1వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో వేలాది మంది పాల్గొనాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సి.హెచ్. రాజారెడ్డి పిలుపునిచ్చారు.

దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలోని దొడ్డి కొమురయ్య స్మారక భవనంలో శుక్రవారం జరిగిన మండల సమితి సమావేశానికి రైతు సంఘం జిల్లా నాయకులు బిల్లా తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాజారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఎస్.ఐ.ఆర్ పేరుతో రాష్ట్రంలో, దేశంలో లక్షలాది ఓట్లను తొలగించడం జరుగుతోందని ఆరోపించారు. కావున తక్షణమే ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సీపీఐ దేవరుప్పుల మండల కార్యదర్శి జీడి ఎల్లయ్య మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కోసం గ్రామ గ్రామాన తిరిగి పీడిత ప్రజల కోసం పనిచేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జెండాలను పల్లె పల్లెనా ఆవిష్కరించాలని నాయకులు, కార్యకర్తలకు నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఆది సాయన్న, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకులు బిల్లా తిరుపతిరెడ్డి, బెజగం ఎల్లయ్య, ఎడ్ల సోమనారాయణ, బాష్పాక సోమన్న, పైండ్ల సుధాకర్, భాషిపాక సోమన్న తదితరులు పాల్గొన్నారు.