prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 8:35 am Digital Edition : UPENDHAR JANAGON

జనగామ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ నియామక పత్రాల అందజేత

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జనగామ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ మండల, నియోజకవర్గ, బ్లాక్ స్థాయి నియామక పత్రాలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ చేతుల మీదుగా గురువారం అందజేశారు.
ఈ నియామక పత్రాలను జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు జాయ మల్లేష్ స్వీకరించారు.

జనగామ జిల్లాలో సేవాదళ్ ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం, మండల, నియోజకవర్గ, బ్లాక్ స్థాయిల్లో సంస్థాగత కార్యకలాపాలను విస్తరించడమే ఈ నియామకాల ప్రధాన లక్ష్యం. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయనున్నారు.

క్రమశిక్షణ, సేవాభావం, ప్రజాసేవ లక్ష్యంగా జనగామ జిల్లాలో సేవాదళ్ ను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా నాయకత్వం కృషి చేయనుంది. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ నియామకాలు కీలక అడుగుగా నిలవనున్నాయి.

ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదినారాయణ, పట్టణ అధ్యక్షుడు కౌవిడె శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కిషన్ నాయక్, లింగాల వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శులు బిరు సత్యనారాయణ, మెంతుల కృష్ణయ్య, బ్లాక్ అధ్యక్షులు మొగం కృష్ణంరాజు, శివరాత్రి పరశురాములు, గుగులోతు కృష్ణ నాయక్, మండల అధ్యక్షులు గాదెపాక శ్రీధర్, జిల్లా కార్యదర్శి మోటే మల్లేష్, సేవాదళ్ నాయకులు సలేంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.