చిన్నారి లాస్యశ్రీని ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):జనగామ నియోజకవర్గం తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో గల బీఆర్ గార్డెన్స్‌లో సోమ రాజశేఖర్, రజిని దంపతుల ప్రథమ పుత్రిక లాస్యశ్రీ నూతన వస్త్ర, ఫల, పుష్పాలంకరణ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. పూలతో అలంకరించిన వేదిక, సాంప్రదాయ వాతావరణం వేడుకకు ప్రత్యేక శోభను తెచ్చాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. చిన్నారి లాస్యశ్రీని ఎత్తుకొని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, భవిష్యత్తులో...