prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 6:26 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణ రావు పటేల్ జన్మదిన వేడుకలు

*ఘనంగా మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణ రావు పటేల్ జన్మదిన వేడుకలు*

*కాంగ్రెస్ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పోస్టర్ల ఆవిష్కరణ*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 27:–
ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ముధోల్ తాలూకా ఇంచార్జ్ బోస్లే నారాయణ రావు పటేల్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నవంబర్ 27 సందర్భంగా కమలా జిన్నింగ్ ఫ్యాక్టరీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, పట్టణ, మండల అధ్యక్షులు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పేద కుటుంబాలకు అండగా నిలిచే ఇలాంటి పథకాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ సందర్భంగా తనూర్ మండల్ మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. బోస్లే నారాయణ రావు పటేల్ రాజకీయ ప్రస్థానం ప్రజాసేవకు నిదర్శనమని కొనియాడారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం లభిస్తోందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
బడగం గ్రామ సర్పంచ్ గోవిందరావు మాట్లాడుతూ.. బోస్లే నారాయణ రావు పటేల్ నాయకత్వం గ్రామీణ ప్రాంతాల కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం ఆలోచించే నాయకుడని పేర్కొన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత అని, ఆయన జన్మదినం సందర్భంగా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శంకర్ చంద్ర మాట్లాడుతూ.. బోస్లే నారాయణ రావు పటేల్‌కు పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం అభినందనీయమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ నాయకులు, కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని తెలిపారు. పార్టీ కష్టకాలంలోనూ కార్యకర్తలకు అండగా నిలుస్తూ, ముధోల్ తాలూకాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ జన్మదిన వేడుకల్లో భైంసా పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే. అరవింద్, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, సర్పంచ్ గోవిందరావు, హఫీజ్ ఉల్లా ఖాన్, మొహమ్మద్ లతీఫ్, మక్సూద్ ఖాన్. సయ్యద్ షాహిద్. అల్మా ఖాన్, జఫర్, మతీన్ ఖాన్, పాషా తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని బోస్లే నారాయణ రావు పటేల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.