prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 4:22 pm Digital Edition : PRAJA VANI

గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి బీఎం సందీప్‌ను కలిసిన కర్రీ నాగేంద్రబాబు

గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి బీఎం సందీప్‌ను కలిసిన కర్రీ నాగేంద్రబాబు

సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: బీఎం సందీప్

హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజావాణి):

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శుక్రవారం రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ పెట్టెం నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సోషల్ మీడియా సమావేశానికి రాష్ట్ర సోషల్ మీడియా సెక్రటరీ కర్రీ నాగేంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బీఎం సందీప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు ఈ సమావేశానికి హాజరైనట్లు నాగేంద్రబాబు తెలిపారు.

ఈ సందర్భంగా బీఎం సందీప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రతి గడపకు చేరవేయాలని సూచించారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో సోషల్ మీడియా నాయకులు కీలక పాత్ర పోషించాలని అన్నారు.

కర్రీ నాగేంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని అన్ని విధాలుగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.